ఆయనను తక్షణం పదవి నుంచి తొలగించాలి: పృథ్వీ 'సరస' వ్యాఖ్యలపై ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం డిమాండ్‌

12-01-2020 Sun 10:48
  • ఇంకెంతమందిని వేధిస్తున్నాడో
  • సినిమా పరిశ్రమలో తప్పులు చేయడం వేరు
  • ఆధ్యాత్మిక సంస్థలో ఇటువంటి పనులు చేయడం వేరు
  • ఆయనపై జగన్ చర్యలు తీసుకోవాలి

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్‌... ఓ ఉద్యోగినితో జరిపిన సరస సంభాషణ ఆడియో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం మండిపడింది. ఈ రోజు ఆ సంఘం నేతలు తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 'తక్షణం పృథ్వీని ఆ పదవి నుంచి తొలగించాలి. ఇంకెంతమందిని వేధిస్తున్నాడో.. సినిమా పరిశ్రమలో తప్పులు చేయడం వేరు. ఆధ్యాత్మిక సంస్థలో ఇటువంటి పనులు చేయడం తప్పు. ఆయనపై జగన్ చర్యలు తీసుకోవాలి' అని డిమాండ్ చేశారు.

'ఎవరిని పడితే వారిని పెద్ద హోదాల్లో నియమించడం సరికాదు. పద్మావతి గెస్ట్‌హౌస్‌లో కూర్చొని ఆయన మద్యం తాగుతుంటాడని కూడా మాకు ఫిర్యాదులు వచ్చాయి. కఠిన చర్యలు తీసుకోవాలి. కొందరి వద్ద ఆయన డబ్బులు కూడా వసూలు చేశాడు. ఓ మహిళ అతడి వ్యాఖ్యలను బయటపెట్టింది కాబట్టి ఈ విషయం అందరికీ తెలిసింది. ఆయన ఇటువంటివి ఇంకా ఎన్నిచేశారో. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా పృథ్వీరాజ్‌ను కొనసాగిస్తే ఆ సంస్థకే అప్రతిష్ఠ' అని ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం సభ్యులు విమర్శించారు.