Darbar: 'దర్బార్' నుంచి ఆ సీన్లు కట్ చేసిన నిర్మాతలు!

  • దర్బార్ లో వివాదాస్పదమైన కొన్ని సీన్లు
  • శశికళను ఉద్దేశించారంటూ నిరసనలు
  • ఎవరినీ ఉద్దేశించినవి కాదని నిర్మాతల వివరణ
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం 'దర్బార్'లో వివాదాస్పదమైన సీన్లను కట్ చేశామని నిర్మాతలు ప్రకటించారు. సినిమాలోని జైలు సీన్లలో " డబ్బు ఉంటే జైలు నుంచి బయటకు వెళ్లి షాపింగ్‌ చేసి రావచ్చు" అన్న డైలాగ్ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. కేవలం వినోదం కోసమే డైలాగ్ పెట్టామని, ఎవరినీ ఉద్దేశించినది కాదని నిర్మాతలు వివరణ ఇచ్చినా, ఈ డైలాగ్ తమ నేత శశికళను ఉద్దేశించినదేనని అన్నాడీఎంకేలోని ఓ వర్గం నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆ సంభాషణలను తొలగించామని నిర్మాతలు స్పష్టం చేశారు.

ఇక సినిమాలోని రజనీ డ్రస్సింగ్ స్టయిల్, తాను రౌడీనని చెప్పే మాటలపైనా కేసులు నమోదయ్యాయి. నాలుగు రోజుల్లో ఓ పోలీసు ఫిట్ నెస్ ను నిరూపించుకోవడంపై పోలీసు ఉన్నతాధికారులు కొందరు ఫిర్యాదు చేశారు. ఓ పోలీసు కమిషనర్ హిప్పీ జుత్తు, గడ్డంతో నటించడం ఏంటని, ఇది పోలీసులను అవమానించేవని మాజీ రక్షణ దళ అధికారి మరియ మైఖేల్ తూత్తుక్కుడి థర్డ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఇది 21న విచారణకు రానుంది.
Darbar
Sasikala
Dialogues
Cut
rajanikant

More Telugu News