Ala Vaikunthapuramulo: మహేశ్, ఎన్టీఆర్ పాటలకు బన్నీ సూపర్బ్ డ్యాన్స్... 'అల వైకుంఠపురములో...' కూడా హిట్టే!

  • సినీ ప్రేక్షకులకు సంక్రాంతి విందు
  • ఇప్పటికే హిట్టయిన రజనీ, మహేశ్ సినిమాలు
  • బన్నీ, త్రివిక్రమ్ లకు కూడా సక్సెస్
ఈ సంక్రాంతి తెలుగు సినీ ప్రేక్షకులకు మంచి విందును అందించినట్టే. ఈ సీజన్ లో విడుదలైన 'దర్బార్', 'సరిలేరు నీకెవ్వరు' హిట్ టాక్ ను తెచ్చుకోగా, నేడు అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం 'అల వైకుంఠపురములో..' మంచి పబ్లిక్ టాక్ ను తెచ్చుకుంది. టబు, రోహిణిలు డెలివరీ నిమిత్తం ఆసుపత్రిలో చేరే సీన్ తో ప్రారంభమయ్యే సినిమా, కామెడీ, ఎమోషన్స్ తో సాగిందని ఫ్యాన్స్ అంటున్నారు.

డాక్టర్‌ గా వెన్నెల కిషోర్ కామెడీ హైలైట్ గా నిలిచిందని, పూజా హెగ్డే ఖాతాలో మరో హిట్ పడిందని అంటున్నారు. త్రివిక్రమ్ డైలాగులు బాగున్నాయని అంటున్నారు. సినిమాలో భాగంగా మహేశ్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పాటలను చూపుతూ, బన్నీ చేసిన డ్యాన్స్ అద్భుతమని అంటున్నారు. దీంతో ఈ పండగకు బన్నీకి, త్రివిక్రమ్‌ కు మంచి సక్సెస్ లభించినట్టేనని తెలుస్తోంది.
Ala Vaikunthapuramulo
SarileruNeekevvaru
Allu Arjun
Trivikram
Hit

More Telugu News