బీజేపీ ఎంపీ అరవింద్ టికెట్లు అమ్ముకున్నారు.. లక్ష్మణ్‌తో బీజేపీ శ్రేణుల వాగ్వివాదం

12-01-2020 Sun 06:28
  • ఒకే సామాజిక వర్గానికి టికెట్లు కేటాయిస్తున్నారు
  • బసవ లక్ష్మీనారాయణ కూడా అదే పనిచేస్తున్నారు
  • లక్ష్మణ్‌కు ఫిర్యాదు చేసిన కార్యకర్తలు

బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మునిసిపల్ ఎన్నికల టికెట్లను అమ్ముకుంటున్నారంటూ సొంత పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఆయన టికెట్లు ఇస్తున్నారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు బసవ లక్ష్మీనారాయణ కూడా టికెట్లు అమ్ముకుంటున్నారంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్‌కు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారికి సర్దిచెప్పేందుకు లక్ష్మణ్ ప్రయత్నించినా వినిపించుకోలేదు. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్టు తెలుస్తోంది.