ముంబయి సమీపంలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది మృతి

11-01-2020 Sat 21:39
  • బోయిసర్ గ్రామ పరిధిలోని కొల్వాడేలో ఫ్యాక్టరీ
  • రా.7.20కి పేలుడు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • 15 కిలోమీటర్ల వరకు వినిపించిన పేలుడు శబ్దం  
మహారాష్ట్ర రాజధాని ముంబయి సమీపంలో ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి ఎనిమిది మంది మృతి చెందారు. ముంబయికి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న తారాపూర్ కెమికల్ జోన్ లో భాగమైన బోయిసర్ గ్రామ పరిధిలోని కొల్వాడేలో ఈ ఫ్యాక్టరీ ఉంది. ఈ మేరకు వివరాలను  పోలీసులు వెల్లడించారు.

రాత్రి సుమారు 7.20 గంటలకు ఈ పేలుడు జరిగిందన్నారు. ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ పేలుడు శబ్దం 15 కిలోమీటర్ల వరకు వినిపించిందని స్థానికులు తెలిపారని చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతూ.. సహాయక చర్యలు చేపడుతున్నారు.