హైదరాబాద్ లో ఈ నెల 13 నుంచి 'అంతర్జాతీయ పతంగుల పండుగ'

11-01-2020 Sat 20:01
  • 13 నుంచి 15 వరకు కొనసాగుతుంది
  • స్థానిక పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఫెస్టివల్
  • కైట్ ఫెస్టివల్ తో స్వీట్స్ ఫెస్టివల్ కూడా 

తెలంగాణలోని హైదరాబాద్ లో ప్రతి ఏటా నిర్వహించే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ఈ ఏడాది కూడా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, స్థానిక పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుందని చెప్పారు. అన్ని కులాలు, మతాలు కలిసి జరుపుకునే పండగే ‘పతంగుల పండగ’ అని అన్నారు. కైట్ ఫెస్టివల్ తో స్వీట్స్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.