Telugudesam: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం.. గెలిపించండి: నందమూరి సుహాసిని

  • రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీనే
  • ‘అభివృద్ధి’ అంటే ఏంటో చూపించిందీ మా పార్టీయే
  • మహిళలందరూ కలిసి ముందడుగు వేయాలి.. మమ్మల్ని గెలిపించాలి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారని టీడీపీ నేత నందమూరి సుహాసిని అన్నారు. రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని, ఆ ఘనత ఎన్టీఆర్ కు చెందుతుందని అన్నారు. మహిళలు అభివృద్ధి చెందేందుకు నారా చంద్రబాబునాయుడు తన హయాంలో ఎంతో కృషి చేశారని చెప్పారు. ‘అభివృద్ధి’ అంటే ఏంటో చూపించింది తెలుగుదేశం పార్టీ అని, అభివృద్ధిని కాంక్షించే వాళ్లందరూ, మహిళలందరూ కలిసి ముందడుగు వేసి టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను ఆమె పోస్ట్ చేశారు.

Telugudesam
Telangana
Nandamuri suhasini
Muncipal Elections
NTR
Chandrababu Naidu

More Telugu News