Mahabubabad District: రాజకీయాలపై ఆసక్తితో పోలీస్ ఉద్యోగాన్ని వదిలేసి, కౌన్సిలర్ గా పోటీ!

  • మహబూబ్ నగర్ లోని పాత పాలమూరుకు చెందిన వ్యక్తి రమేశ్ బాబు
  • బీటెక్ పూర్తయ్యాక కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాడు
  • రాజకీయాలపై ప్రేమతో రెండేళ్ల లోపే రిజైన్ చేశాడు

‘రాజకీయాల్లోకి యువత రావాలి.. ప్రజా సేవ చేయాలి’ అన్న రాజకీయనేతల పిలుపు వింటూనే ఉంటాం. ఈ పిలుపు ప్రభావం ఎంత మందిపై ఉంటుందో ఏమో గానీ, ఈ ఇద్దరు యువకులపై మాత్రం ఉంది. అందుకే, తన ప్రభుత్వ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి దిగాడు.  

మహబూబ్ నగర్ జిల్లాలోని పాత పాలమూరుకు చెందిన వ్యక్తి రమేశ్ బాబు. అతని తండ్రి మక్తల్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. స్విట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో రమేశ్ బాబు బీటెక్ పూర్తి చేశాడు. 2016లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఆ ఉద్యోగం కూడా చేశాడు. అయితే, రాజకీయాల్లోకి ప్రవేశించాలని, ప్రజా సేవ చేయాలన్న కోరికతో  2019 అక్టోబర్ లో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ‘మున్సిపల్’ బరిలో కౌన్సిలర్ గా పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న రమేశ్ బాబు, నిన్న పాలమూరు మున్సిపాలిటీ నుంచి టీఆర్ఎస్ తరఫున 11వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు.

ఇక ఈ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన మరో యువకుడు కోమాండ్ల ఎలేందర్ రెడ్డి. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మునిసిపాలిటీకి చెందిన ఎలేందర్ రెడ్డి ఎంసీఏ పూర్తి చేశాడు. నాడు తెలంగాణ ఉద్యమంలోనూ తన వంతు పాత్ర పోషించాడు. ఎలేందర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ తరఫున 11 వార్డు అభ్యర్థిగా నిన్న నామినేషన్ దాఖలు చేశాడు.

More Telugu News