జనసేన సమావేశంలో టీడీపీపై చర్చ

11-01-2020 Sat 16:07
  • విజయవాడలో జనసేన విస్తృత స్థాయి సమావేశం
  • చర్చకు వచ్చిన టీడీపీతో పొత్తు అంశం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామని సూచించిన కొందరు నేతలు

విజయవాడలో ఈరోజు జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో టీడీపీతో పొత్తుపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం.

గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్లే వైసీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలో బీజేపీ బలంగా లేదని మరికొందరు నేతలు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 50 శాతం సీట్లను కేటాయిద్దామని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు, సమావేశం మధ్యలోనే పవన్ ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చిన నేపథ్యంలోనే ఆయన వెళ్లారని చెప్పుకుంటున్నారు.