తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- 45 లక్షల మందికి పెన్షన్ల కోసం రూ.9,002 కోట్లు
- ఇందులో కేంద్రం వాటా రూ.200 కోట్లు మాత్రమే
- కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయి
45 లక్షల మందికి పెన్షన్ల కోసం రూ.9,002 కోట్లు ఖర్చు అవుతుందని, దీనిలో కేంద్రం వాటా రూ.200 కోట్లు మాత్రమేనని అన్నారు. త్వరలోనే ‘పల్లె ప్రగతి’ తరహాలోనే ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై ఆయన మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని, పసుపు బోర్డు తెస్తానన్న వాగ్దానంతో ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ తన మాటపై నిలబడలేదని విమర్శించారు.