ఏపీకి మూడు రాజధానులు కావాలని అన్ని ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు: మంత్రి బాలినేని

11-01-2020 Sat 14:29
  • టీడీపీ హయాంలో సచివాలయానికి వెళ్లేందుకు రోడ్లు కూడా లేవు
  • రాజధాని పేరిట చంద్రబాబు, లోకేశ్ ల డ్రామాలు తగదు
  • అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలో సచివాలయానికి వెళ్లడానికి రోడ్లు కూడా వేయలేని అసమర్థుడు చంద్రబాబు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరిట చంద్రబాబు, ‘శుద్దపప్పు’ లోకేశ్ లు ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఏపీకి మూడు రాజధానులు కావాలని, అన్ని ప్రాంతాల అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

ఏపీలో ‘అమ్మఒడి’తో ‘సంక్రాంతి’ ముందే వచ్చింది: దేవినేని అవినాశ్

ఏపీలోని అమ్మఒడి పథకంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆ పార్టీ నేత దేవినేని అవినాశ్ అన్నారు. ఏపీ ‘రాష్ట్రానికి జగన్ మామయ్య ముఖ్యమంత్రి కావడం మా వరం’ అని విద్యార్థులు అంటున్నారని చెప్పారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంతో సంక్రాంతి పండగ ముందే వచ్చినట్టుందని అన్నారు.