తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముగిసిన నామినేషన్లు

10-01-2020 Fri 17:51
  • చివరిరోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు
  • 9 కార్పొరేషన్లు, 120 పురపాలికల్లో దాఖలైన నామినేషన్లు 
  • ఈ నెల 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు గడువు ముగిసింది. రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లు, 120 పురపాలికల్లో నామినేషన్లు దాఖలు చేశారు. 325 మంది కార్పొరేటర్, 2,727 కౌన్సిలర్ డివిజన్లకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు ఇవాళ చివరిరోజు కావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరగనుంది. ఈ నెల 14 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 22న పోలింగ్ జరగనుండగా, 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.