Andhra Pradesh: ఇచ్చేది 42 లక్షల మందికి అయితే 82 లక్షల మంది పిల్లలకు లబ్ది ఎలా చేకూరుతుందో దొంగలెక్కల మేధావే చెప్పాలి: నారా లోకేశ్

  • అమ్మ ఒడి అమలుపై లోకేశ్ విమర్శలు
  • అమ్మ ఒడి కాదు అబద్ధాల ఒడి అంటూ వ్యాఖ్యలు
  • ప్రతి బిడ్డకు ఇస్తానని పాదయాత్రలో చెప్పారని ఆరోపణ

అమ్మ ఒడి పథకం అమలుపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అది అమ్మ ఒడి కాదని, అబద్ధాల ఒడి అని విమర్శించారు. ఈ పథకంలో నగదు ఇచ్చేది 42 లక్షల మందికి అయితే 82 లక్షల మంది పిల్లలు ఎలా లబ్ది పొందుతారో దొంగ లెక్కల మేధావి జగనే జవాబు చెప్పాలని ఎద్దేవా చేశారు.

బడికి వెళ్లే ప్రతి బిడ్డకు అని పాదయాత్రలో చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక ఇంటికి ఒకరికే అని మాట మార్చారంటూ లోకేశ్ ఆరోపించారు. కరెంటు బిల్లు, హాజరు అంటూ తలా తోకాలేని ఆంక్షలు పెట్టి లబ్దిదారులను సగానికి సగం కోసేశారని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకుంటాం అని జగన్ కూశారని, ఇప్పుడు ఆయా వర్గాలకు చెందాల్సిన రూ.6,500 కోట్ల మేర కోత పెట్టారని విమర్శించారు.

More Telugu News