ఆ స్టార్ కమెడియన్ కి నాపై ఎందుకు కోపం వచ్చిందో తెలియదు: నటుడు శివారెడ్డి

10-01-2020 Fri 16:39
  • నాకు ఎవరితోనూ గొడవలు లేవు 
  • వివాదాలకు మొదటి నుంచి దూరం 
  • ఆయన అలా చేస్తే బాగుండేదన్న శివారెడ్డి 

నటుడిగా .. మిమిక్రీ ఆర్టిస్ట్ గా శివారెడ్డికి మంచి పేరు వుంది. అయితే నటుడిగా శివారెడ్డికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అందుకుగల కారణమేమిటనేది మాత్రం ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఓ స్టార్ కమెడియన్ కి ఆయన కోపం తెప్పించడమే అందుకు కారణమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తూ ఉంటుంది.

తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి శివారెడ్డి ప్రస్తావించాడు. "మొదటి నుంచి కూడా నేను ఎలాంటి వివాదాల జోలికి వెళ్లను. ఎవరితో గొడవలు .. మనస్పర్థలు లేవు. అయితే ఒక స్టార్ కమెడియన్ కి మాత్రం నాపై కోపం వచ్చింది. అది ఎందుకన్నది నిజంగానే నాకు తెలియదు. నా ప్రవర్తన .. మాట తీరు ఆయనను నొప్పించాయేమోనన్నది కూడా నాకు తెలియదు. కాకాపట్టే వాళ్లను ప్రోత్సహించాలా? కష్టపడేవాళ్లను ప్రోత్సహించాలా? అనేది ఆయన ఆలోచన చేసి వుంటే బాగుండేది" అని చెప్పుకొచ్చాడు.