Andhra Pradesh: తుళ్లూరు ఘటనపై రేపు రాష్ట్రానికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధారణ కమిటీ

  • రాజధాని కోసం మహిళల ఆందోళన
  • తుళ్లూరులో మహిళలపై పోలీసు చర్య
  • సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్
రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న మహిళలపై పోలీసు చర్యకు దిగడాన్ని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో రేపు అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధారణ కమిటీ రానుంది. కమిటీని రేపు పంపిస్తున్నామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ తెలిపారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్ ఇప్పటికే పోలీసులకు నోటీసులు కూడా పంపింది. మహిళల్ని పోలీసులు తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారని, దురుసుగా ప్రవర్తించారని కొన్ని మీడియా చానళ్లలో వచ్చిన కథనాలను కూడా కమిషన్ పరిశీలించింది.
Andhra Pradesh
Amaravati
Tulluru
Women
Police
NCW

More Telugu News