థాయ్ లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'పొన్నియిన్ సెల్వన్'

10-01-2020 Fri 13:16
  • చోళరాజుల కాలంలో సాగే కథ 
  • నిర్మాణ భాస్వామిగానూ మణిరత్నం 
  • ఏఆర్ రెహ్మాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ 

చోళరాజుల కాలానికి సంబంధించిన నేపథ్యంలో మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' సినిమా చేస్తున్నారు. విక్రమ్ .. కార్తీ .. జయం రవి .. ఐశ్వర్య రాయ్ .. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. మోహన్ బాబు ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ ను థాయ్ లాండ్ లో ప్లాన్ చేశారు.

ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కొన్ని రోజులుగా అక్కడ చిత్రీకరిస్తూ వచ్చారు. రీసెంట్ గా ఈ షెడ్యూల్ షూటింగు పూర్తికావడంతో, ఈ సినిమా టీమ్ చెన్నైకి చేరుకుంది. లైకా ప్రొడక్షన్స్ వారు .. మద్రాస్ టాకీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.