ముద్దాడబోయిన అభిమాని... సారా అలీ ఖాన్ కు చేదు అనుభవం... వీడియో ఇదిగో!

10-01-2020 Fri 12:55
  • ముంబైలో ఘటన
  • జిమ్ కు వెళ్లి వస్తున్న వేళ సెల్ఫీలు
  • అతిగా ప్రవర్తించిన అభిమాని

స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తెగా, తెరంగేట్రం చేసిన అందాల భామ సారా అలీ ఖాన్, ఓ జిమ్ నుంచి బయటకు వస్తున్న వేళ చేదు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని ఆమె చేతిని అందుకుని ముద్దాడబోయాడు. దీంతో షాక్ కు గురైన ఆమె తన చేతిని వెనక్కు లాగేసుకుంది. ఈ ఘటన ముంబైలో జరిగింది.

జిమ్ నుంచి సారా బయటకు రాగానే, అక్కడే వేచివున్న మీడియా, కొన్ని స్టిల్స్ ఇవ్వాలని కోరగా, ఆమె ఇస్తూ నిలబడింది. ఈలోగా కొందరు ఆమెను సెల్ఫీలు అడిగితే ఇచ్చింది. అదే సమయంలో మరో అభిమాని వచ్చి, ఆమెతో కరచాలనాన్ని కోరాడు. ఆమె చేతిని అందించగా, ముద్దాడబోయాడు. వెంటనే అక్కడి సెక్యూరిటీ, అతన్ని కొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని మీరు కూడా చూడవచ్చు.