జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో... లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ, ఎస్సైలపై సస్పెన్షన్ వేటు

10-01-2020 Fri 12:42
  • రూ.50 వేలు లంచం తీసుకుంటూండగా పట్టివేత
  • ఇద్దరిని సస్పెండ్ చేస్తూ.. సీపీ ఉత్తర్వులు
  • పోలీసు శాఖలో అవినీతిని సహించమన్న సీపీ

అవినీతి నిరోధక శాఖ వలలో పోలీసులు పడ్డారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో లంచం తీసుకుంటున్న ఎస్సై, సీఐలను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో రూ.50వేలు లంచం తీసుకుంటూ ఎస్సై సుధీర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు.

ఈ నేపథ్యంలో ఎస్సై సుధీర్ రెడ్డి సహా అందులో ప్రమేయమున్న సీఐ బలవంతయ్యపై కూడా సస్పెన్షన్ విధిస్తున్నట్లు సీపీ అంజనీ కుమార్ ప్రకటించారు. పోలీసుల శాఖలో అవినీతి ఉండకూడదని.. సీపీ పేర్కొంటూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారిపై సస్పెన్షన్ వేటు వేశామని చెప్పారు.