'అదిరింది' కోసం భారీ మొత్తం వసూలు చేస్తున్న చమ్మక్ చంద్ర

10-01-2020 Fri 11:00
  • కమెడియన్ గా చమ్మక్ చంద్రకి క్రేజ్
  • గతంలో ఒక్కో కాల్షీట్ కి 3 లక్షలు
  • ఇప్పుడు ఒక్కో కాల్షీట్ కి 5 లక్షలు

'జబర్దస్త్' కామెడీ షోను ఫాలో అయ్యేవారికి చమ్మక్ చంద్రను గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరంలేదు. 'జబర్దస్త్'లో స్కిట్స్ చేసే కమెడియన్స్ చాలా మందినే ఉన్నప్పటికీ చమ్మక్ చంద్ర ప్రత్యేకత వేరు. పక్కింటావిడకో .. ఎదురింటావిడకో లైన్ వేసే కంటెంట్ తో కితకితలు పెడతాడు. ఒక్కో స్కిట్ ను ఒక్కో ఊతపదంతో పరుగులు తీయిస్తాడు.

అలాంటి చమ్మక్ చంద్ర ఆ షో కోసం నెలకి 4 కాల్షీట్స్ కేటాయించేవాడట. ఒక్కో కాల్షీట్ కోసం 3 లక్షలు తీసుకునేవాడట.'జబర్దస్త్' నుంచి 'అదిరింది' షోకి మారిపోయిన ఆయన, ఒక్కో కాల్షీట్ కోసం 5 లక్షలు తీసుకుంటున్నాడట. చమ్మక్ చంద్రకి అంత మొత్తం పారితోషికం ఇవ్వొచ్చనీ, ఆయన స్కిట్స్ ఆ రేంజ్ లోనే వుంటాయని ఆ ఛానల్ వారికి నాగబాబు సిఫార్స్ చేశారని కూడా చెప్పుకుంటున్నారు.