ఈ శుక్రవారం కబుర్లు ఎందుకు రెడ్డీ?: బుద్ధా వెంకన్న

10-01-2020 Fri 11:00
  • అమరావతి, విశాఖల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించండి
  • అప్పుల్లో ఉన్నామని ఏడుపులు ఎందుకు?
  • మీ అవినీతి సొమ్ము వెనక్కిస్తే సరిపోతుందన్న బుద్ధా వెంకన్న

విజయసాయి రెడ్డికి దమ్ముంటే అమరావతి, విశాఖపట్నంలో రెండు చోట్లా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. 

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టిన ఆయన, " ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొన్న భూముల విలువ లక్ష కోట్లా ఎంపీ విజయసాయి రెడ్డి గారు? మరి మీ జగన్ గారు గాడిదలు కాస్తున్నారా? శుక్రవారం కబుర్లు ఎందుకు విజయసాయి రెడ్డి గారు. దమ్ముంటే అమరావతి, విశాఖపట్నం రెండు చోట్లా ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేయించు" అని సవాల్ విసిరారు.