Amaravati: రాజధాని ప్రాంతంలో మహిళల రేపటి పాదయాత్రకు అనుమతి లేదు: రూరల్ ఎస్పీ విజయరావు

  • ఉద్దండరాయునిపాలెం- విజయవాడ దుర్గ గుడి వరకు  పాదయాత్ర
  • ఈ పాదయాత్రలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు
  • 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయి
రాజధాని అమరావతి ప్రాంతంలో మహిళలు తలపెట్టిన రేపటి పాదయాత్రకు పోలీసుల అమనుతి లభించలేదు. రేపు ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గగుడి వరకు మహిళలు తలపెట్టిన పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని గుంటూరు రూరల్ ఎస్పీ విజయరావు తెలిపారు. ఈ పాదయాత్రలో ఎవరైనా పాల్గొంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని అన్నారు. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రజలు చేపట్టొదని హెచ్చరించారు.
Amaravati
Capital
Rural
Sp
Vijayarao

More Telugu News