కారుణ్య మరణం ఉద్యోగాల మాదిరిగా తండ్రి సీఎం పదవిపై జగన్ ఆశపడ్డారు: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు

09-01-2020 Thu 20:10
  • ఒకప్పుడు జగన్ ఎంత పన్ను కట్టారు?
  • ఇప్పుడు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?
  • నాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకున్నాడు

ఏపీ సీఎం జగన్ పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు వరప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. కారుణ్య మరణం ఉద్యోగాల మాదిరిగా తండ్రి సీఎం పదవిపై జగన్ ఆశపడ్డారని విమర్శించారు. నాడు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకుని, సంపద సృష్టించుకున్న వ్యక్తి జగన్ అని ఆరోపించారు.

ఏపీలో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు జగన్ ఎంత పన్ను కట్టారు? ఇప్పుడు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించారు. ఏపీకి మూడు రాజధానుల అంశం గురించి ప్రస్తావిస్తూ, జగన్ కు పరిపాలన చేతకాకనే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు.