‘అమ్మఒడి’పై సీఎం జగన్ రోజుకో మాట మారుస్తున్నారు: ‘జనసేన’ నేత నాదెండ్ల

09-01-2020 Thu 19:25
  • ఈ పథకంలో పారదర్శకత లోపించింది
  • యూ-టర్న్ లు తీసుకుంటున్న జగన్ 
  • అప్పుడు ఈ పథకం కింద 65 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారే!

ఏపీలో ఇవాళ ప్రారంభమైన ‘అమ్మఒడి’ పథకంపై జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకంలో పారదర్శకత లోపించిందని, సీఎం జగన్ రోజుకోమాట మాట్లాడుతున్నారని, యూ-టర్న్ లు తీసుకుంటున్న విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. అప్పుడు ఈ పథకం కింద 65 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరుతుందని చెప్పిన వైసీపీ నేతలు, ఇప్పుడు ఆ సంఖ్యను 43 లక్షలకు కుదించారని విమర్శించారు.