రాజధాని మహిళలను కించపరుస్తూ అసభ్యకర పోస్టింగ్స్!

09-01-2020 Thu 19:18
  • రాజధాని ప్రాంత మహిళల ఆగ్రహం
  • తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • ఈ ఫిర్యాదులో ఓ వ్యక్తిపై ఆరోపణ

రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్స్ దర్శనమిస్తున్నాయి. దీనిపై రాజధాని ప్రాంత మహిళలు మండిపడుతున్నారు. ఈ మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రవీంద్రరెడ్డి అనే వ్యక్తి తమపై ఈ పోస్టింగ్స్ పెట్టారని తమ ఫిర్యాదులో మహిళలు ఆరోపించారు.