'అమ్మ ఒడి' ప్రారంభోత్సవంలో ఇంగ్లీషులో అదరగొట్టిన విద్యార్థిని... వెలిగిపోయిన సీఎం జగన్ ముఖం

09-01-2020 Thu 16:27
  • చిత్తూరులో 'అమ్మ ఒడి' ప్రారంభించిన సీఎం జగన్
  • సీఎంను పొగడ్తల వర్షంలో ముంచెత్తిన బాలిక
  • ఆద్యంతం ఇంగ్లీషులోనే ప్రసంగించిన విద్యార్థిని

ఏపీలో 43 లక్షల మంది తల్లులకు లబ్ది చేకూర్చేలా వైసీపీ ప్రభుత్వం 'అమ్మ ఒడి' పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని సీఎం జగన్ ఇవాళ చిత్తూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడడం సభకు హాజరైన జనాన్నే కాదు, వేదికపై ఉన్న జగన్ ను కూడా ముగ్ధుడ్ని చేసింది. ఎక్కడా తడబాటు లేకుండా, 'అమ్మ ఒడి' పథకాన్ని వివరించడమే కాకుండా, సీఎం జగన్ ను పొగడ్తల వర్షంలో ముంచెత్తింది. అంతేకాదు, ఇంగ్లీషు భాష ప్రాధాన్యతను ఇంగ్లీషులో వివరించింది. నాడు నేడు కార్యక్రమం విశిష్టతను కూడా సభాముఖంగా వివరించి సీఎంను సంతోషానికి గురిచేసింది.