జియో ఖాతాదారులకు శుభవార్త.. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో వై-ఫై కాలింగ్!
- దేశవ్యాప్తంగా అందుబాటులోకి
- వై-ఫైను ఉపయోగించుకుని వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం
- గ్రామీణ ఖాతాదారులకు వరం
ఈ సేవల వల్ల మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని సమయంలోనూ కాల్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉన్న వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని కాల్స్ చేసుకోవచ్చు. ఈ సేవల కోసం అదనంగా ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది. వై-ఫై కాలింగ్‌ను ఉపయోగించుకోవడానికి ఫోన్‌లోని వై-ఫై సెట్టింగ్స్‌లోకి వెళ్లి కాలింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.