Reliance: జియో ఖాతాదారులకు శుభవార్త.. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో వై-ఫై కాలింగ్!

  • దేశవ్యాప్తంగా అందుబాటులోకి
  • వై-ఫైను ఉపయోగించుకుని వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే సదుపాయం
  • గ్రామీణ ఖాతాదారులకు వరం

ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల తీసుకొచ్చిన వై-ఫై కాలింగ్ సేవలకు పోటీగా రిలయన్స్ జియో కూడా దేశవ్యాప్తంగా వై-ఫై కాలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చని జియో ఈ సందర్భంగా పేర్కొంది. ఈ ఫీచర్ 150కి పైగా మొబైల్ మోడళ్లలో పనిచేస్తుందని జియో తెలిపింది. కాగా, ప్రత్యర్థి ఎయిర్‌టెల్ వై-ఫై కాలింగ్ సేవలు కేవలం మూడు మోడళ్లకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.

ఈ సేవల వల్ల మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేని సమయంలోనూ కాల్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుబాటులో ఉన్న వై-ఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని కాల్స్ చేసుకోవచ్చు. ఈ సేవల కోసం అదనంగా ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది. వై-ఫై కాలింగ్‌ను ఉపయోగించుకోవడానికి ఫోన్‌లోని వై-ఫై సెట్టింగ్స్‌లోకి వెళ్లి కాలింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

More Telugu News