JNU: జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి కేసులో కీలక ఆధారాలు లభ్యం

  • ఆదివారం క్యాంపస్‌లోకి చొరబడిన ముసుగు వ్యక్తులు
  • విద్యార్థులను చితకబాదిన వైనం
  • చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశం

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆదివారం విద్యార్థులపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులను రక్తమోడేలా చితకబాదారు. ఈ ఘటన తర్వాత విద్యార్థులు, అధ్యాపకుల్లో భయం నెలకొంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు చేపట్టిన దర్యాప్తులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. త్వరలోనే కేసును ఛేదించనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, విద్యార్థులు, అధ్యాపకుల్లో నెలకొన్న భయాందోళనలను పోగొట్టి, క్యాంపస్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చర్యలు తీసుకోవాలంటూ జేఎన్‌యూ పాలకవర్గాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ జగదీశ్ కుమార్ తెలిపారు. 

More Telugu News