అమరావతి రాజధానిని కొనసాగించే వరకూ మా పోరాటం ఆగదు: సీపీఐ నేత రామక‌ృష్ణ

08-01-2020 Wed 20:52
  • అరెస్టుల ద్వారా మమ్మల్ని ఆపలేరు 
  • ఐదు నిమిషాల్లో మా బస్సులు ఇక్కడికి రావాలి
  • తమని అడ్డుకోవద్దని హెచ్చరించిన రామకృష్ణ

అమరావతి రాజధానిని కొనసాగించే వరకూ తమ పోరాటం ఆగదని ఏపీ ప్రభుత్వాన్ని సీపీఐ నేత రామకృష్ణ హెచ్చరించారు. విజయవాడలోని అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద బస్సు యాత్రకు బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, అరెస్టుల ద్వారా తమను ఆపలేరని హెచ్చరించారు. ఐదు నిమిషాల్లో కనుక తమ బస్సులు ఇక్కడికి రాకపోతే తామే అక్కడికి వెళతామని, అడ్డుకోవద్దని హెచ్చరించారు.