అవినీతి, నమ్మకద్రోహం, అబద్ధాలు... చంద్రబాబు పాలనను అంతకుమించి వర్ణించలేం: విజయసాయిరెడ్డి

08-01-2020 Wed 19:32
  • చంద్రబాబు రాష్ట్రానికి చేసిన సేవ ఏదీ లేదు 
  • భూ మాఫియాకు నాయకత్వం వహించాడు 
  • చరిత్రలో అతిపెద్ద కుంభకోణానికి బాటలు పరిచాడని ఆరోపణ

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పాలనను నిర్వచించాలంటే అవినీతి, నమ్మకద్రోహం, అబద్ధాలమయం అని చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. అమరావతిలో భూ మాఫియాకు నాయకత్వం వహించడం తప్ప చంద్రబాబు రాష్ట్రానికి చేసిన సేవ ఏదీ లేదని విమర్శించారు. ప్రజలను మోసం చేసి ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి బాటలు పరిచాడని ఆరోపించారు. అంతేకాకుండా, 'అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్' అంటూ ఓ కరపత్రాన్ని కూడా ట్వీట్ చేశారు.