Amartya Sen: పౌరసత్వ చట్టంపై అమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు

  • పౌరసత్వ చట్టం రాజ్యాంగ విరుద్ధం
  • మతాన్ని పౌరసత్వంతో ముడిపెట్టకూడదు
  • ఎక్కడ పుట్టాడు? ఎక్కడ నివసిస్తున్నాడు? అనేదే పౌరసత్వాన్ని నిర్ణయిస్తుంది

పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మతపరమైన వ్యత్యాసాలను పౌరసత్వంతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించాలని కోరారు.

బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన అమర్త్యసేన్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి ఎక్కడ పుట్టాడు? ఎక్కడ నివసిస్తున్నాడు? అనేదే పౌరసత్వాన్ని నిర్ణయిస్తుందని చెప్పారు.

మతం పేరుతో అణచివేతకు గురి చేయాలనే ఈ అంశంపై రాష్ట్ర అసెంబ్లీలలో చర్చ జరగాలని సేన్ సూచించారు. మన దేశానికి వెలుపల ఉన్న హిందువులపై సానుభూతి చూపాల్సిందేనని, వారిని పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని కూడా ఆయన అన్నారు. పౌరసత్వం చట్టం మతాలకు అతీతంగా ఉండాలని చెప్పారు.

More Telugu News