నిర్భయ దోషుల ఉరితీతకు ట్రయల్స్ వేయనున్న జైలు అధికారులు
- నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ
- ఈ నెల 22న అమలుకు సన్నాహాలు
- మూడో నెంబరు జైల్లో ఏర్పాట్లు
దోషుల బరువుకు సమానమైన బరువులను ఆ తాళ్లకు కట్టి ప్రయోగాత్మకంగా ఉరితీస్తారు. తద్వారా తాళ్లలో కానీ, ఉరికొయ్యలో కానీ ఏవైనా లోపాలుంటే సరి చేస్తారు. తీహార్ ప్రాంగణంలోని మూడో నెంబరు జైలు ఈ ట్రయల్స్ కు వేదిక కానుంది. ఈ ముందస్తు సన్నాహాల్లో జైలు సూపరింటిండెంట్ సహా అధికారులు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది.