ఒక రేంజ్ లో జరిగిన 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ బిజినెస్

08-01-2020 Wed 10:03
  • విడుదలకి ముస్తాబవుతున్న 'సరిలేరు నీకెవ్వరు'
  • కీలకమైన పాత్రలో విజయశాంతి 
  • ప్రపంచ వ్యాప్తంగా 101.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్

మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో విజయశాంతి ఒక కీలకమైన పాత్రను పోషించారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను జనవరి 11వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

క్రేజీ కాంబినేషన్ కావడం వలన .. పండుగ సీజన్ కావడం వలన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 77.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 101.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. రాజేంద్ర ప్రసాద్ .. ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాతో మహేశ్ బాబు కెరియర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో అభిమానులు వున్నారు.