జేఎన్ యూ క్యాంపస్ కు వెళ్లి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించిన దీపిక

07-01-2020 Tue 21:31
  • ఆదివారం రాత్రి జేఎన్ యూ క్యాంపస్ లో విద్యార్థులపై దాడి
  • అధ్యాపకులపైనా దాడికి పాల్పడిన దుండగులు
  • ఐషే ఘోష్ ను పరామర్శించిన దీపిక

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ) విద్యార్థులపై కొందరు దుండగులు క్యాంపస్ లోనే దాడికి పాల్పడడం పట్ల అన్ని వర్గాల నుంచి స్పందనలు వస్తున్నాయి. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే జేఎన్ యూ విద్యార్థులకు, అధ్యాపకులకు సంఘీభావం ప్రకటించారు. ఆదివారం రాత్రి జరిగిన హింస పట్ల విద్యార్థులకు సానుభూతి వ్యక్తం చేశారు. జేఎన్ యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ ను కలిసి ఆమె నిబ్బరానికి చేతులు జోడించి నమస్కారం చేశారు.