ఇండోర్ టి20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా

07-01-2020 Tue 18:38
  • ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ  
  • తొలి మ్యాచ్ వర్షార్పణం
  • సిరీస్ లో ముందంజ వేయాలని టీమిండియా పట్టుదల

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో టి20 మ్యాచ్ కు ఇండోర్ ఆతిథ్యమిస్తోంది. ఈ పోరులో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ కు గువాహటి వేదికగా నిలవగా వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో కోహ్లీ టాస్ గెలిచినా వరుణుడి కారణంగా ఒక్క బంతి పడుకుండానే మ్యాచ్ క్యాన్సిల్ అయింది.

ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో ముందంజ వేయాలని భారత్ భావిస్తోంది. అయితే కుర్రాళ్లతో నిండిన శ్రీలంక ఇటీవల టి20 క్రికెట్ లో మెరుగైన ఆటతీరు కనబరుస్తోంది. ఆతిథ్య జట్టుకు గట్టిపోటీ ఇవ్వాలని లసిత్ మలింగ నాయకత్వంలో లంక కృతనిశ్చయంతో ఉంది.