ట్రాఫిక్ ఎలా ఆపుతారంటూ టీడీపీ కార్యకర్తలపై పామర్రు ఎమ్మెల్యే ఆగ్రహం

07-01-2020 Tue 17:27
  • లోకేశ్ అరెస్ట్ తో టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం
  • తోట్లవల్లూరు కరకట్టపై ధర్నా
  • నిలిచిన ట్రాఫిక్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో తోట్లవల్లూరు కరకట్టపై ఉద్రిక్తత నెలకొంది. లోకేశ్ ను విడుదల చేయాలంటూ టీడీపీ కార్యకర్తలు కరకట్టపై ధర్నాకు దిగారు. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో పామర్రు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ టీడీపీ కార్యకర్తలపై ఆగ్రహం ప్రదర్శించారు. ట్రాఫిక్ ఎందుకు ఆపుతున్నారంటూ మండిపడ్డారు. అయితే, ధర్నా విరమించేది లేదని టీడీపీ నేత గురుమూర్తి, ఆయన అనుచరులు ధర్నా కొనసాగించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేతో వాగ్యుద్ధానికి దిగారు. దాంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య బాహాబాహీ నెలకొంది. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.