Amaravati: చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్.. తన మనవడితో ఆడుకోవడం మంచిది: ఎమ్మెల్యే పిన్నెల్లి

  • శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు బాబు యత్నిస్తున్నారు
  • చంద్రబాబు రైతులను దగా చేయాలని చూస్తున్నారు
  • బాబు ట్రాప్ లో రైతులు పడొద్దు
తాను ప్రయాణిస్తున్న వాహనంపై దాడి జరగడంపై మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఇది తగదని విమర్శించారు.

చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం రైతులను దగా చేయాలని చూస్తున్నారని, బాబు ట్రాప్ లో రైతులు పడొద్దంటూ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అని, ఆయన తన మనవడితో ఆడుకోవడం మంచిదంటూ సెటైర్లు విసిరారు.
Amaravati
Chandrababu
YSRCP
mlc
Pinneli

More Telugu News