దెయ్యం భయంతో ఆ ఇల్లు ఖాళీ చేసేశాను: హీరోయిన్ అంజలి

07-01-2020 Tue 15:30
  • ఆ ఇంట్లో దెయ్యం వుందనిపించేది 
  • హోటల్ రూమ్ కి వెళ్లిన సందర్భాలు వున్నాయి 
  • ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్న అంజలి  

తెలుగు .. తమిళ భాషల్లో హారర్ సినిమాలు చేసిన అనుభవం అంజలికి వుంది. 'గీతాంజలి' సినిమాలో దెయ్యం పాత్రతో ఆమె ప్రేక్షకులను భయపెట్టేసింది. అలాంటి అంజలి నిజ జీవితంలో దెయ్యానికి భయపడిపోయిందట. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని చెప్పింది.

"నేను ఇప్పుడు ఉంటున్న ఇంట్లో కాకుండా అంతకుముందు ఒక ఇంట్లో వుండే దానిని. ఆ ఇంట్లో దెయ్యం వుందనిపించేది. రాత్రి 12 గంటలు కాగానే ఆ దెయ్యం వచ్చి నన్ను నిద్రలేపుతుందనిపించేది. ఆ భయంతో ఒక్కోసారి రాత్రికి రాత్రే హోటల్ కి వెళ్లి ఆ రాత్రికి అక్కడ రూమ్ తీసుకుని పడుకున్న రోజులున్నాయి. ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు భయంతోనే గడిపాను. దెయ్యం భయం కారణంగానే ఆ ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఇంటికి మారిపోయాను. ఇప్పుడు అంతా ప్రశాంతగా వుంది" అని చెప్పుకొచ్చింది.