Gaganyaan: అంతరిక్షంలోకి వెళ్లే మన వ్యోమగాముల కోసం ఇడ్లీ సాంబార్, వెజ్ పులావ్ రెడీ

  • గగన్ యాన్ పేరిట ఇస్రో అంతరిక్ష కార్యక్రమం
  • ఈ ఏడాదే గగన్ యాన్
  • నలుగురు వ్యోమగాముల ఎంపిక

'గగన్ యాన్' పేరిట ఇస్రో వ్యోమగాములతో కూడిన అంతరిక్ష యాత్రను చేపడుతున్న సంగతి తెలిసిందే. 2021 డిసెంబర్లో నిర్వహించే గగన్ యాన్ కోసం నలుగురు భారత వాయుసేన సిబ్బందిని కూడా వ్యోమగాములుగా ఎంపిక చేశారు. వారికి రష్యాలో రోదసి పరిస్థితులపై శిక్షణ ఇవ్వనున్నారు.

 అయితే, అంతరిక్షంలో మన వ్యోమగాముల కోసం మైసూర్ లోని డిఫెన్స్ పుడ్ రీసెర్చ్ ల్యాబ్ ఎక్కువకాలం నిల్వ ఉండే ప్రత్యేక ఆహార పదార్థాలను రూపొందించింది. వాటిలో ఇడ్లీ సాంబార్ మొదలుకొని వెజిటబుల్ పులావ్ వరకు దాదాపు 30 రకాలు వంటకాలున్నాయి. ఎగ్ రోల్స్, వెజ్ రోల్స్, ఉప్మా, హల్వా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ ఆహార పదార్థాలను వేడి చేసుకునేందుకు ప్రత్యేక ఇండక్షన్ తరహా హీటర్ కూడా రీసెర్చ్ ల్యాబ్ రూపొందించింది.

More Telugu News