Guntur District: పిన్నెల్లి వాహనంపై టీడీపీ నాయకులే రాళ్ల దాడికి పాల్పడ్డారు: వైసీపీ ఆరోపణ

  • చినకాకానిలో పిన్నెల్లి కాన్వాయ్ పై దాడి  
  • పిన్నెల్లిపై హత్యాయత్నం జరిగింది
  • ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తల గూండా గిరి
ప్రభుత్వ విప్, మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈరోజు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా చినకాకాని వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై ఆందోళనకారులు దాడి చేసిన ఘటనపై వైసీపీ మండిపడుతోంది. ఈ సందర్భంగా టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేసింది.

పిన్నెల్లిపై హత్యాయత్నం జరిగిందని, ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు గూండా గిరి చేశారని ఆరోపించారు. రైతులు, సామాన్య ప్రజల ముసుగులో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులే రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా పిన్నెల్లి వాహనంపై దాడి వీడియోను పోస్ట్ చేశారు.
Guntur District
kakani
Telugudesam
Pinneli
ycp

More Telugu News