Amaravati: అమరావతి రైతులపై లాఠీఛార్జ్ చేస్తోన్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

  • చినకాకాని వద్ద హైవేను దిగ్బంధించిన ఆందోళనకారులు
  • మంత్రుల వాహనాలు కూడా ముందుకు కదలని పరిస్థితి 
  • హైవేపై ఉన్న వాహనాలపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న ఆందోళనల్లో భాగంగా చినకాకాని వద్ద హైవేను దిగ్బంధించిన విషయం తెలిసిందే. రైతుల నిరసనలతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడం, మంత్రుల వాహనాలు కూడా ముందుకు కదలని పరిస్థితి నెలకొనడంతో ఆందోళన కారులపై పోలీసులు లాఠీ ఝళిపించారు.

అంతకు ముందు హైవేపై ఉన్న వాహనాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెబుతూ లాఠీఛార్జీ చేస్తుండడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Amaravati
Andhra Pradesh
Police

More Telugu News