రాజధాని విషయంలో అక్రమాలు జరిగాయి.. అడిగితే నేను వివరాలు ఇస్తాను: టీడీపీ నేత మాణిక్య వరప్రసాద్

07-01-2020 Tue 11:16
  • రాజధానిలో అక్రమాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోండి
  • కొందరు రెవెన్యూ అధికారులు అక్రమాలు చేశారు
  • పోలీసుల నిర్బంధం మధ్య ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు

అమరావతి రాజధాని రైతుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాజధానిని మార్చాలనే సీఎం జగన్ చర్యలు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని విమర్శించారు.

రాజధాని భూముల విషయంలో కొందరు రెవెన్యూ అధికారులు అక్రమాలు చేశారని, ప్రభుత్వం అడిగితే తాను అన్ని వివరాలు ఇస్తానని మాణిక్య వరప్రసాద్ తెలిపారు. రాజధానిలో అక్రమాలు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోండని ఆయన కోరారు. పోలీసుల నిర్బంధం మధ్య ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరని ఆయన చెప్పుకొచ్చారు. రైతుల కోసం పోరాడుతున్న వారిని నిర్బంధాలకు గురి చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు.