Nano: రతన్ టాటా కలల కారుకు పూర్తిగా గుడ్ బై!

  • కాలగర్భంలో కలసిపోయిన నానో
  • 2019లో ఒక్క కారు కూడా తయారు కాలేదు
  • భవిష్యత్తులో తయారుచేసే ఉద్దేశముందన్న టాటా

మధ్య తరగతి ప్రజల కలల కారుగా వచ్చిన టాటా నానో, పూర్తిగా కాలగర్భంలో కలసిపోయింది. నానో కారు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయిందని, 2019లో ఒక్క కారును కూడా తయారు చేయలేదని సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్ సమాచారాన్ని అందించింది.

2018లో తయారు చేసిన ఒకే ఒక్క నానో కారును ఫిబ్రవరి 2019లో విక్రయించామని తెలిపింది. ప్రజల్లో ఆసక్తి ఉంటే కారును తయారీ చేయడం తిరిగి ప్రారంభిస్తామని చెప్పింది. కాగా, ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఇండియా మొత్తం బీఎస్-6 ఉద్గార నిబంధనలు అమలులోకి రానున్న కారణంగా చౌక కార్లను తయారు చేయడం అసాధ్యమేనని వాహన పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More Telugu News