Sathya Prakash: ఆ కో డైరెక్టర్ తిట్టిన తిట్టు నాకు గునపంలా గుచ్చుకుంది: నటుడు సత్యప్రకాశ్

  • నాకు ఆ టిఫిన్ సరిపోలేదు 
  • సెట్లో నుంచి బయటికి పంపించేశారు 
  • ఆ కో డైరెక్టర్ కి గట్టిగానే చెప్పానన్న సత్యప్రకాశ్  

తెలుగు తెరపై ప్రతినాయక పాత్రల ద్వారా సత్యప్రకాశ్ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కెరియర్ తొలినాళ్లలో తనకి ఎదురైన ఒక అనుభవాన్ని గురించి ప్రస్తావించారు."సుమన్ .. భానుచందర్ .. అరుణ్ పాండ్యన్ హీరోలుగా చేస్తున్న ఒక సినిమాకి నన్ను తీసుకున్నారు. షూటింగుకి ముందు నాకు రెండు ఇడ్లీలు - ఒక వడ మాత్రమే పెట్టారు. అది నాకు సరిపోలేదు .. మరో ఇడ్లీ అడిగితే వేయలేదు.

ఆ రోజున ఫైట్ సీన్ సరిగ్గా చేయలేకపోయాను. దాంతో నన్ను బయటికి పంపించేశారు.  నా వెనుకే బయటికి వచ్చేసిన కో డైరెక్టర్ నన్ను ఒక తిట్టు తిట్టాడు. అది నన్ను గునపంలా గుచ్చుకుంది. అప్పుడు నేను పడ్డ బాధ అంతా ఇంతా కాదు. ఆ తరువాత కొంత కాలానికి నేను నటుడిగా ఎదిగాను .. ఆ కో డైరెక్టర్ మాత్రం అలాగే వున్నాడు. ఒకసారి నాకు డైలాగ్ చెప్పడానికి నా దగ్గరికి వచ్చాడు. గతంలో నన్ను తిట్టిన విషయాన్ని ఆ కో డైరెక్టర్ కి గుర్తుచేశాను. ఇండస్ట్రీలోకి ఎన్నో ఆశలతో వచ్చే వాళ్లను అలా అవమానించవద్దని గట్టిగానే చెప్పాను" అని అన్నారు.

More Telugu News