Nayanatara: విఘ్నేశ్ శివన్ ప్రేమలో సంతోషంగా వున్నాను: నయనతార

  • అభిమానులకు ధన్యవాదాలు 
  •  విఘ్నేశ్ శివన్ సహకారం మరువలేనిది 
  • పుకార్లకు చెక్ పెట్టిన నయనతార
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా నయనతారకి విపరీతమైన క్రేజ్ వుంది. ఒక వైపున సినిమాలు చేస్తూనే, మరో వైపున దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో కలిసి విదేశాల్లో విహరిస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోలు బయటికి వచ్చేసి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నయనతార ఒక వేడుకకి హాజరయ్యారు. జీ సినీ తమిళ అవార్డుల వేడుకకి హాజరైన ఆమె, ఉత్తమనటి, శ్రీదేవి అవార్డులు అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకి అవార్డులు దక్కడానికి కారణమైన అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. తన కలలను నిజం చేసుకోవడంలో విఘ్నేశ్ శివన్ సహకారం ఎంతో ఉందని అన్నారు. విఘ్నేశ్ శివన్ ప్రేమలో తాను చాలా సంతోషంగా ఉన్నాననీ, ఆయన ప్రేమలో తాను చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని చెప్పారు. ఇటీవల విఘ్నేశ్ శివన్ .. నయనతార విడిపోయినట్టుగా వార్తలు షికారు చేశాయి. నయనతార మాటలు ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేశాయి.
Nayanatara
Vighnesh Shivan

More Telugu News