Amaravati: పదమూడు జిల్లాల ప్రజల నినాదం ఒక్కటే.. ‘సేవ్ అమరావతి- సేవ్ ఆంధ్రప్రదేశ్’: చంద్రబాబునాయుడు

  • అమరావతి కోసం ఉద్యమం చేస్తోంది రైతులు కాదంటారా?
  • ఈ ఆకుపచ్చ సముద్రాన్ని చూసి ఏమంటారు?
  • వీళ్లంతా మీ కళ్లకు పెయిడ్ ఆర్టిస్టులా?
రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రైతులు ఉద్యమిస్తుంటే ఆ ఉద్యమం రైతులు చేస్తోంది కాదని వైసీపీ నేతలు విమర్శిస్తారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. అమరావతి కోసం ఉద్యమం చేస్తోంది రైతులు కాదని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని, బినామీలని ఇష్టానుసారం మాట్లాడే వైసీపీ నేతలు.. ఈ ఆకుపచ్చ సముద్రాన్ని చూసి ఏమంటారు? వీళ్లంతా మీ కళ్లకు పెయిడ్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారా? అంటూ ధ్వజమెత్తారు.  

‘పోగాలం దాపురించిన వాళ్లు దేనినీ లెక్కచేయరు’ అని ప్రసిద్ధ రచయిత చిన్నయ సూరి చెప్పిన సూక్తిని ప్రస్తావిస్తూ వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదమూడు జిల్లాల ప్రజల నినాదం ఒక్కటే ‘సేవ్ అమరావతి- సేవ్  ఆంధ్రప్రదేశ్’ అని అన్నారు.
Amaravati
Farmers
Telugudesam
Chandrababu

More Telugu News