చిన్న బ్రేక్ ఇస్తున్నాను... తరువాత బొమ్మ దద్దరిల్లిపోద్ది.. ఆకట్టుకుంటోన్న 'సరిలేరు నీకెవ్వరు' ట్రయిలర్ ఇదిగో!

06-01-2020 Mon 08:31
  • ట్రెండ్ సెట్ చేస్తున్న ట్రయిలర్
  • 30 లక్షలు దాటిన వ్యూస్
  • మహేశ్ కామెడీ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా, రష్మికా మందన్న హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం ట్రయిలర్ గత రాత్రి విడుదలై ట్రెండ్ సెట్ చేస్తోంది. నిన్న రాత్రి 9 గంటలకు విడుదలైన ట్రయిలర్ కు యూ ట్యూబ్ లో ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ట్రయిలర్ లోనే మహేశ్ బాబు కామెడీ టైమింగ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ట్రయిలర్ చివరిలో మహేశ్ చెప్పిన "చిన్న బ్రేక్ ఇస్తున్నాను... తరువాత బొమ్మ దద్దరిల్లిపోద్ది" డైలాగ్, హైలైట్ గా నిలిచింది.