Vizag: విశాఖలో మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన బస్సు దగ్ధం

  • పూర్తిగా కాలిపోయిన బస్సు
  • లారీ మెకానిక్ గ్యారేజ్ లో ఘటన
  • కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు
విశాఖపట్నంలోని లారీ మెకానిక్ గ్యారేజ్ లో అగ్నిప్రమాదం జరిగింది. గాజువాక పోర్టు రోడ్డులోని పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న గ్యారేజ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన ఓ బస్సు  కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సరికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో గ్యారేజ్ లో ఎవరూ లేరు. దీనిపై కేసు నమోదు చేసుకున్న గాజువాక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Vizag
Bus
Fire Accident
Police
Andhra Pradesh

More Telugu News