మెగాస్టార్ ను దగ్గరగా చూసి మురిసిపోయిన రష్మిక

05-01-2020 Sun 20:50
  • హైదరాబాదులో ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం
  • చీఫ్ గెస్ట్ గా విచ్చేసిన చిరంజీవి

మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరుగుతోంది. ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ ఫంక్షన్ కు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడంతో మెగా అభిమానులు సైతం భారీ సంఖ్యలో హాజరయ్యారు.

కాగా, ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చిన హీరోయిన్ రష్మిక మందన్న అప్పటికే అక్కడికి వచ్చిన చిరంజీవిని చూసి సంతోషం పట్టలేకపోయింది. అంత సమీపం నుంచి మెగాస్టార్ ను చూసిన ఆనందం రష్మిక ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆయన ముందు కూర్చుని తన హర్షం వెలిబుచ్చింది. తన పట్ల అంత అభిమానాన్ని ప్రదర్శిస్తున్న రష్మికను చూసి చిరంజీవి కూడా ముగ్ధులయ్యారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు.