Kenya: కెన్యాలోని అమెరికా వైమానిక స్థావరంపై ఉగ్ర పంజా

  • దాడికి పాల్పడిన అల్ షబాబ్ ఉగ్రసంస్థ
  • అల్ ఖైదా అనుబంధ గ్రూపుగా అల్ షబాబ్ కు గుర్తింపు
  • దాడికి తమదే బాధ్యత అని ప్రకటించిన అల్ షబాబ్

ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కెన్యాలోని అమెరికా వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కెన్యాలోని మందా ఎయిర్ స్ట్రిప్ వద్ద జరిగిన ఈ దాడిలో పలు చమురు ట్యాంకులు దగ్ధమయ్యాయి. అల్ ఖైదా అనుబంధ సంస్థ అల్ షబాబ్ గ్రూపు ఈ దాడికి పాల్పడింది. అల్ షబాబ్ సోమాలియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంటుంది. కాగా, ప్రతిదాడుల్లో ఇప్పటివరకు నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు కెన్యా రక్షణ దళాలు ప్రకటించగా, తమ దాడిలో 7 విమానాలు, 3 సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయని అల్ షబాబ్ పేర్కొంది. కాగా, అమెరికా రక్షణ దళాలు కూడా ఈ దాడిని ధ్రువీకరించాయి.

More Telugu News